![]() |
![]() |

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో లీడర్ ఎంపిక కోసం శ్రీముఖి ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ పెట్టింది. నాలుగు నిమ్మకాయలను గాల్లోకి విసిరితే వాటిని పట్టుకున్న అమన్, భాగీ, రామకృష్ణ, రాజకుమారి నలుగురు తొలి లీడర్ కంటెండర్లు అయ్యారు. నిమ్మకాయ పట్టుకునే క్రమంలోనే అపూర్వ, అమన్ మధ్య చిన్న గొడవ కూడా జరిగింది.
ఆ తర్వాత బరువు సంచుల టాస్క్ పెట్టారు. ఐదు సంచుల్లో కొన్నిట్లో బరువు ఉంది.. కొన్నిట్లో లేదు. ఎవరు నిజంగా బరువు మోస్తున్నారో మిగిలిన వాళ్లు గెస్ చేయాలి. మిథిలేష్ వచ్చి రాజ కుమారి బరువు మోయడం లేదని తప్పుగా చెప్పడంతో రాజకుమారి డైరెక్ట్ గా ఫస్ట్ లీడర్ అయిపోయింది. ఆ తర్వాత శ్రష్టి వచ్చి రామకృష్ణ బరువు మోస్తున్నాడని కరెక్ట్ గా గెస్ చేసి సెకండ్ లీడర్ అయింది. మూడో లీడర్ కోసం వెనిగర్ జ్యూస్ టాస్క్ పెట్టారు. దీపక్, రామకృష్ణ, భాగీలకు మూడు జ్యూసులు ఇచ్చారు.. అందులో ఒకే ఒక్క దాంట్లో వెనిగర్ ఉంది. దాన్ని ఎవరు తాగారో కనిపెట్టాలి. ప్రశాంత్ వచ్చి అమన్ తాగాడని తప్పు సమాధానం చెప్పాడు. యాక్చువల్ గా తాగింది దీపక్. దీంతో అమన్ థర్డ్ లీడర్ గా సెలెక్ట్ అయ్యాడు.
ఫైనల్ గా ముగ్గురు లీడర్లకు స్ట్రా టాస్క్ పెట్టారు. ఒకేలా కనిపించే మూడు స్ట్రాలలో పెద్ద, మీడియం, చిన్న సైజులు ఉన్నాయి. చిన్న స్ట్రా వచ్చిన శ్రష్టి తన టీంలోకి దీపక్, రోహిత్, చరణ్ లను, మీడియం స్ట్రా వచ్చిన రాజ కుమారి భాగీ, మిథిలేష్, ఝాన్సీ, ప్రియలను తీసుకుంది. పెద్ద స్ట్రా వచ్చిన అమన్ కి మిగిలిన వాళ్లంతా వచ్చారు. అప్పుడే భాగీ తన 'స్టీల్ ది హాఫ్' కార్డుతో అమన్ టీమ్ స్కోర్ ని కొట్టేస్తా అని చెప్పి గేమ్ మార్చేసింది
![]() |
![]() |